అమెరికాలోని మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంకో టెహనాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయినట్టు పోలీసులు చెప్పారు.
ముగ్గురు విద్యార్థులతో సహా మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో 10 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. దాదాపు 20 నుంచి 25 నిమిషాలవరకు కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమ్తితం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్‌ను చుట్టుముట్టి… దుండగుడిని మట్టుబెట్టారు.