దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ స్కాం కేసు(2జీ స్పెక్ట్రం కేటాయింపులో చోటు చేసుకున్న కుంభకోణం)పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం(పటియాల హౌస్ కోర్టు) గురువారం తీర్పును వెలువరించనుంది. ప్రధాన నిందితులుగా ఉన్నన ఎ రాజా, కనిమొళిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.
వీరితోపాటు నిందితులుగా ఉన్న మిగితావారిని కూడా నిర్ధోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు ఎ రాజా, కనిమొళిలకు పెద్ద ఊరటగానే చెప్పవచ్చు. వీరిపైన నమోదైన మూడు కేసుల్లో ఒక కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కనిమొళి, రాజా ఇళ్ల వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతకుముందు కే విచారణ నేపథ్యంలో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా పలువురు నేతలు, కార్పొరేట్ సంస్థల అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరు కోర్టుకు హాజరయ్యారు.