బీటింగ్ రిట్రీట్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. న్యూఢిల్లీలోని విజయ్ చౌక్‌లో ఈ వేడుక జరిగింది. గణతంత్ర దినోత్సవం జరిగిన తర్వాత మూడవవ రోజున అంటే జవనరి 29న బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన బ్యాండ్స్ ఈ వేడుకను అత్యుద్భుతంగా నిర్వహిస్తాయి. ఆర్మీకి చెందిన పైప్ బ్యాండ్ కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది మొత్తం 26 ప్రదర్శనలు జరిగాయి. వాళ్లంతా తమ మ్యూజిక్‌తో అదరగొట్టారు.