తొలిపలుకు న్యూస్ (మాదాపూర్) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ రంజిత్ రెడ్డి మరియు గౌరవ ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా. రంజిత్ రెడ్డి, ముఖ్య అథిదులుగా పాల్గొని 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పర్యవేక్షణలో యువనేత దొడ్ల రామకృష్ణ , ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఎల్లమ్మబండ గోదాకృష్ణ గార్డెన్ లో 124 డివిజన్ TRS పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ముందుగా డివిజన్ లోని 74 బస్తీల కమిటీల అధ్యక్షులు కార్యదర్శి పదవులు ప్రకటించిన తరువాత 124 డివిజన్ మెయిన్ కమిటీ అధ్యక్షులుగా G.సమ్మా రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా అనిల్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శిగా గుడ్ల శ్రీనివాస్ మరియు డివిజన్ అనుబంధ కమిటీలైన బీసీ సెల్ అధ్యక్షులుగా సి.శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా కె.యోహాన్(జాన్), ఎస్టీ సెల్ అధ్యక్షులుగా వెంకట్ నాయక్, మైనారిటీ అధ్యక్షులుగా ఎండి. షరీఫుద్దీన్, యువజన అధ్యక్షులుగా రహమాన్, మహిళా అధ్యక్షులుగా రాజ్యలక్ష్మి, టి.ఆర్.ఎస్.వి అధ్యక్షులుగా ప్రదీప్ రెడ్డి, టి.ఆర్.ఎస్.కె.వి అధ్యక్షులుగా బాలస్వామి, సోషల్ మీడియా అధ్యక్షులుగా సాయి గౌడ్, క్రిస్టియన్ కమ్మునిటీ అధ్యక్షులుగా సత్యం రాజు, మహిళా మైనారిటీ అధ్యక్షులుగా షేక్ బీబీ, మహిళా ఎస్.సి సెల్ అధ్యక్షులుగా అంజలి లను ప్రకటించి పదవుల ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు, డివిజన్ అనుబంధ కమిటీ సభ్యులు, బస్తీ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.