రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకు అంతా పెరుగుతూ కలవరపెడుతున్న వేళా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ, చేతులకు సానిటైజర్ రాసుకుని జాగ్రత్తగా ఉంటే కరోనా భారిన పడకుండా ఉండొచ్చు. కోవిడ్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నందుకు గాను మహారాష్ట్రలో రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి దుస్థితి తెలంగాణ కి రావద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలందరిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా పట్టించుకోకుండా పెడచెవిన పెడుతు రోడ్ల మీద మాస్క్ లేకుండా విచ్చలవిడిగా తిరుగుతు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపద్యంలో పోలీసు శాఖ అలర్ట్ అయ్యింది. మూతికి మాస్క్ లేకుండా ఎవ్వరు కనపడినా ముక్కు పిండి 1000 రూపాయలు చాలాన్ వసూలు చేస్తున్నారు. 10 రూపాయలతో పోయే దానిని వెయ్యి రూపాయల దాకా తెచ్చుకున్నాం అంటూ తలలు పట్టుకుంటున్నారు మాస్క్ పెట్టని ప్రబుద్ధులు. మరి కొందరయితే పలు మార్లు చలాన్ కట్టడానికే ఇష్టపడుతున్నారు కానీ మాస్క్ మాత్రం పెట్టడం లేదు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదంటూన్నారు తెలంగాణ పోలీసులు. ఇలా చెయ్యడం వల్ల అయినా రానున్న రోజుల్లో కరొనా తగ్గుముఖం పదుతుందో లేదో వేచిచూడాలి..
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more