జీడిమెట్ల : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, జీడిమెట్ల డివిజన్లో వ్యాక్సిన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయడం సంతోషంగా ఉందని జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ తారా చంద్రారెడ్డి అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ ఇంజనీర్ సురేందర్ నాయక్ సర్టిఫికెట్ను కార్పొరేటర్ కు అందజేశారు. ఈ సందర్భంగా తారా చంద్రారెడ్డి మాట్లాడుతూ…
ప్రజలు కోవిడ్ బారినుండి దూరం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టగా విశేష స్పందన లభించిందన్నారు. డివిజన్లో పూర్తి స్థాయిలో కాలనీవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో సైతం ప్రజలు రోగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...
Read more