*ముఖ్య అతిథులుగా పాల్గొన్న చైర్మన్ ఆకుల లలిత, చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, బిగ్ బాస్ ఫేమస్ మానస్ నాగులపల్లి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి,ప్రణయ్,రాజీవ్, కార్పొరేటర్ శ్యామల
తెలంగాణ సరస్వతి పరిషత్ బొగ్గులకుంటలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు సందర్భంగా సకల జనుల సేవాసమితి ఆధ్వర్యంలో మహిళా మణి అవార్డ్స్ మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ మహిళ ర్యాం వాక్ మరియు ఇతర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆకుల లలిత, చైర్మన్ టూరిజం కార్పొరేషన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న మానస నాగులపల్లి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ , ప్రణయ్ కుమార్ , రాజీవ్ ఇతరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సామాజిక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న వారికి మరియు సమాజంలో లో అన్ని రంగాలలో కృషిచేసిన మహిళలను గుర్తించి వారికి మహిళా మణి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీ దల్ అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే మానవ మనుగడ లేదు స్త్రీ లేకపోతే సృష్టి లో జీవం లేదు.స్త్రీ అనేది ఒక అక్షరం కానీ తనను బాధిస్తే జన్మజన్మలకు తప్పదు శాపం అని తెలియజేశాడు. స్త్రీలు గొప్పతనం గురించి వివరించడం జరిగింది స్త్రీలు వంటింటికే పరిమితం కాకుండా నింగికి ఎగిసారు , ఎక్కడైతే మహిళను గౌరవిస్తారో పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు అనేది అక్షర సత్యం, దేవతలుగా పూజించవలసిన మహిళలపై అత్యాచారాలు అవమానాలు ఎదుర్కోవడం చాలా బాధాకరం అని తెలియజేశారు. ఆడపిల్లగా కాదమ్మా ఆడ పులి, ఆదిపరాశక్తి గా జీవించాలి అని తెలియజేశాడు. సమాజ నిర్మాణంలో సగభాగం స్త్రీ , అని తెలియజేస్తూ, అన్నింటా మేమున్నామంటూ అన్ని రంగాలలో ముందుకు సాగాలి, గొప్ప గొప్ప విజయాలు సాధించి చరిత్రలో నమోదు చేసుకోవాలని తెలియజేశాడు.