హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, హుజురాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి దళిత కుటంబానికి దళిత బంధు పథకం వర్తింప చేస్తాం..ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రకారం, నియోజకవర్గంలోని 20 వేల కుటుంబాలకు పైగా దళితులకు ఈ పథకం వర్తింస్తుందన్నారు. శాలపల్లి లో 16 న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 14 మంది పేద దళితులకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశారు.
ఈ నెల 17 నుండి ఈ పథకం గ్రామంలో ని సర్పంచ్, ఎంపిటిసి, ఇతర ప్రజా ప్రతినిధుల తో పాటు గ్రామానికి ఒక అధికారిని నియమించి, అందరి సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి లభ్డిదారుల ఎంపిక చెయ్యడం జరుగుతుంది అని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా 20 వేల కుటుంబాలకు, సుమారు రూ. 2 వేల కోట్లు నిధులచే ఈ పథకం ద్వారా లభ్డిదారులకు ప్రోసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుందని ట్రబుల్ షూటర్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు తెలియజేశారు.