నకిరేకల్- నార్కేట్ పల్లిమార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్ కమిషనరేట్ కు చెందిన ఆర్మూడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ సిరాజ్ మరణించారు. ఎమ్మెల్సీ పల్లరాజేశ్వరావు ఎస్కాట్ గా విధులు నిర్వహిస్తున్న సిరాజ్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు పూర్తి అయిన అనంతరం తిరుగు ప్రయాణంలో గత రాత్రి 12 గంటల నకిరేకల్- నార్కేట్ పల్లిమార్గంలోని వివేర హోటల్ వద్ద టీ త్రాగేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ఢీ కోట్టడంతో త్రీవంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ ను,హైదరబాద్ లో ఓ ప్రవైయిట్ హస్పటల్ కు తరలించగా చికిత్స పోందుతూ ఈ రోజు తెల్లవారుజామున మరణించాడు. మరణించిన హెడ్ కానిస్టేబుల్ కి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తే వున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ సిరాజ్ కుటుంబానికి వరంగల్ పోలీస్ కమిషనర్డా డా. తరుణ్ జోషి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతికి నిదర్శనం సదర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి శ్రీకృష్ణుని అంశతో జన్మించిన యాదవులు...
Read more