మరో సారి దేశంలో మోదీ సర్కారు తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలని వడ్డెవల్లి శరణ్ అన్నారు. కూకట్ పల్లి కె పి హెచ్ బి కాలనీలో శనివారం బిజెపి శ్రేణులు వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, బిజెపి నాయకుడు వడ్డేవల్లి శరణ్ లు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకుడు వడ్డెవల్లి శరణ్ కుమార్ తెలిపారు.మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి నేతృత్వంలో కూకట్ పల్లి వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడమే కాకుండా విస్తృత స్థాయిలో భారతీయ జనతాపార్టీకి ప్రచారం కల్పించేందుకు వాల్ రైటింగ్స్ చేపట్టనున్నట్లు తెలిపారు.కూకట్ పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ లో ఈ వాల్ రైటింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.అనంతరం పన్నాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, బీజేపీతోనే దేశ, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, ప్రగతి సాధ్యమని రానున్న ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. వాల్ రైటింగ్స్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు చెరుకు కుమారస్వామి, ఉప్పల చంద్రశేఖర్ గుప్త, వినోద్ కుమార్ గౌడ్, సాదు ప్రతాప్ రెడ్డి, సత్యనారాయణ, రఘురాం, చిన్న, సాయి తదితరులు పాల్గొన్నారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more