రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్ తన రూ.198 ప్రీపెయిడ్ ప్యాక్‌ను సవరించింది. ఇకపై ఈ ప్యాక్‌లో రోజుకు 1.4 జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్యాక్‌లో భాగంగా ఖాతాదారులు అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది. కాలపరిమితి 28 రోజులు. ఎయిర్‌టెల్ రూ.199, జియో రూ.149 ప్యాక్‌లకు పోటీగా వొడాఫోన్ ఈ ఆఫర్ ప్రకటించగా, ఇప్పుడు ప్యాక్‌లో అందిస్తున్న డేటాకు అదనంగా మరో 400 ఎంబీని ఇవ్వనుంది.
వొడాఫోన్ రూ.198 ప్రీపెయిడ్ ప్యాక్‌లో గతంలో వినియోగదారులు రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత లోకల్ కాల్స్ (రోజుకు 250 నిమిషాలు, వారానికి వెయ్యి నిమిషాలు) రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభించేవి. ఎయిర్‌టెల్ ఇటీవలే తన రూ.199 ప్లాన్‌ను సవరించి రోజుకు రూ.1.4 జీబీని అందిస్తుండగా, జియో కూడా రూ.149 ప్లాన్‌ను సవరించి రోజుకు రూ.1.5 జీబీని అందిస్తోంది. ఈ మూడు ప్యాక్‌ల కాలపరిమితి కూడా 28 రోజులే.