హీరోలు సినిమాల్లోకి తమ కొడుకుల్ని పరిచయం చేయడం పరిపాటి. అలా పరిచయం చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన హీరో వినోద్ కుమార్. తరువాత చాలా కాలం వరకు సినిమాలు చేయలేదు. సహ నటుడు గా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. అప్పట్లో కుటుంబ కథా చిత్రాల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
హీరో వినోద్ కుమార్ పెద్ద కొడుకు తెరంగేట్రం చేయనున్నట్టు ఆయన తెలిపారు. నటన, మార్షల్ ఆర్ట్స్ లలో ఇప్పటికే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కన్నడ నుండి చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ తెలుగు నుంచే పరిచయం చేయాలని ఉందని చెప్పాడు. మంచి స్టోరీ గురించి వెయిటింగ్ అని, మంచి కథ కన్ఫామ్ అయ్యాక ఎంట్రీ ప్లాన్ చేస్తామని చెప్పాడు.