నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ పెళ్ళి కుదిరిందా? ఆయన పెళ్ళి లావణ్య త్రిపాటీ తో ఫిక్స్ అయిందని ఒక న్యూస్ చెక్కర్లు కొట్టింది. అయితే అది నిజమో, కాదో ఈరోజు తెలిసిపోయింది. ఇంతకుముందు వరుణ్ బెంగుళూరు వెళ్ళినపుడు ఆయన లావణ్య కోసమే అక్కడికి వెళ్ళాడని, డైమండ్ రింగ్ తో ప్రపోజ్ చేయబోతున్నాడని, వాళ్ళిద్దరూ హాలిడే ట్రిప్ లో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి.

తాజాగా లావణ్య తను ఫ్యామిలీ ట్రిప్ లొ ఉన్నానని డెహ్రాడూన్ లో ని లొకేషన్ లలో ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో తను ఫ్యామిలీ ట్రిప్ లో ఉందని వరుణ్‌తో కాదని క్లారిటీ వచ్చింది. వరుణ్‌తో పెళ్ళి వట్టి పుకారని తేలిపోయింది.
