ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పార్టీ నుంచి టిఆర్ఎస్ సస్పెండ్ చేసింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఆరోపణ లు ఎదుర్కొంటున్నందున, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చెసారు. ఈ సస్పెన్షన్ వెంటనే అమలవుతుందని తె.రా.స శ్రేణులు తెల్పాయి.
ఖమ్మం జిల్లా పాల్వంచ లో నిన్న ఆత్మహత్య చేసుకున్న రామక్రిష్ణ సెల్ఫీ వీడియో వైరల్ గా మారడం తో, పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుండి నిరసనలు వినిపించాయి. అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.
ఆ వీడియో లో తనకు రామక్రిష్ణ నుండి ముప్పు ఉందని, తన భార్యను తీసుకురావాలని వేధిస్తున్నాడని వాపోయాడు. తను వొక్కడే ఆత్మహత్య చేసుకుంటే తన భార్యా పిల్లలని రాఘవ వదలడని, అందుకే కుటుబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆ వీడియో లో చెప్పాడు.