ప్రముఖ సంస్థ ఫైజర్ 5 సంవత్సరాల లోపు పిల్లలకు కొవిడ్ టీకాను రెడీ చేసింది. చిన్నపిల్లలకు టీకా అందించడంలో ఇది ఒక మైలురాయి. ఈ వాక్సీన్ అత్యవసర వినియోగానికి అమెరికా డ్రగ్ కంట్రోల్ సంస్థ కు ఫైజర్-బయోఎన్‌టెక్ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈనెల పదిహేనో తారీఖున ఎఫ్.డి.ఏ ఈ అనుమతి గురించి నిర్ణయం తీసుకోనుంది.
ఇది అందుబాటు లోకి వస్తే మొదట అనుమతి లభించిన చిన్నపిల్లల కరోణా వాక్సీన్ గా ఫైజర్ ని చెప్పుకోవచ్చు.దీనికి అనుమతి లభిస్తే ఆరునెలల శిశువు నుండి ఐదేళ్ళ పిల్లల వరకు కరోణా వాక్సీన్ అందుబాటులోకి వస్తుంది. ఇది పెద్దవాళ్ళకు ఇచ్చే డోసులో పదోవంతు మాత్రమే ఉంటుంది.