వి కృష్ణ మోహన్ ను చైర్మన్ గా కొనసాగించాలి- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి
రాష్ట్రంలో “కులగణన” ను వెంటనే మొదలు పెట్టండి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% ఇవ్వాల్సిందే
రాజకీయ, బీసి కుల సంఘాల అఖిల పక్ష సమావేశం లో ఆర్.కృష్ణయ్య డిమాండ్
ఈ అంశాలపై చర్చలకు అఖిలపక్ష రాజకీయ పార్టీ లతో, బీసి, కుల సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం వెంటనే సమావేశం నిర్వహించాలి.
నిపుణత, అనుభవం నేపధ్యం గా బీసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం ను కొనసాగించాలి.
పార్టీ రహితం గా పరిశీలించి వకుళాభరణం కొనసాగింపు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
వెంటనే కులగణన ఆరంభించాలని అఖిలపక్షం ఏకగ్రీవం గా డిమాండ్.
గడువు ముగిసిన స్థానిక సంస్థలకువెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్.
పార్టీ సీనియర్ లకు బీసి కమిషన్ లో అవకాశం పేరిట – రాజకీయ పునరావాస కేంద్రం గా మార్చొద్దు అని సూచించిన అఖిలపక్షం
ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్న కులగణను చేపట్టక పోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం ఇది బీసీల వ్యతిరేక చర్యే అని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల తో గడువు ముగుస్తున్న వకుళాభరణం బీసి కమిషన్ ను కొనసాగించి, ఈ అంశాలపై వెంటనే సమగ్ర నివేదికలను తెప్పించుకోవాలన్నారు, బీసీలకు ఇచ్చిన హామీలను పరిష్కరించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కృష్ణయ్య కోరారు.
గురువారం నాడు లక్డికాపూల్ లోని సెంట్రల్ కోర్ట్ హోటల్ లో ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ, బీసి, కుల సంఘాల సమావేశం జరిగింది. ఇందులో అన్ని రాజకీయ పార్టీ ల ప్రతినిధులు, బీసి, కుల సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.బీసి డిమాండ్ లపై గళం ఎత్తారు. రాష్ట్రం లో కుల గణన కు, బీసి లకు 42 % లోకల్ బాడీ ఎన్నికలలో నిర్ణయం అంశాలలో కీలకం గా మారిన బీసి కమిషన్ పై సమావేశం సుదీర్ఘం గా చర్చించింది.
ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశం లో ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ….నెలల తరబడిగా డిమాండ్ల సాధనకు బీసీలు ఉద్యమిస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి చర్యలను చేపట్టకపోవడం పట్ల నిరసనను వ్యక్తం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణం కాదని ఆరోపించారు.ఎన్నికలకు ముందు “కామారెడ్డి బీసి డిక్లరేషన్” లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీసీల ఓట్లతో అధికారం లోకి వచ్చి, హామీలను అమల్లోకి తేకుండా నిర్లక్ష్యం ప్రదర్శించటం ఏమిటని ప్రశ్నించారు. ఇది మెజారిటి ప్రజలైన బీసీలను చిన్న చూపు చూడటమే అని అన్నారు. కులగణన ఉద్యమం కు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక నిబద్దత కలిగిన నాయకుడిగా ముందుకెలుతున్నారని ఆయన రాహుల్ ను అభినందించారు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం కుల గణన అంశం లో పూర్తి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుందని కృష్ణయ్య విమర్శించారు.
కుల గణన నిమిత్తం ప్రభుత్వం జి.ఓ.26 ను విడుదల చేస్తేనే సరిపోతుందా అని, అందుకు నిదుల కేటాయింపులు, విదులను బీసి కమిషన్ కు సూచించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కి నిదర్శనం అన్నారు. మాది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొనే రేవంత్ ప్రభుత్వానికి, మెజారిటి ప్రజలైన బీసీల డిమాండ్లను పరిష్కరించాలనే సోయి కూడా లేకపోవడం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. న్యాయ పరమైన తమ డిమాండ్ల సాధనకు దశల వారిగా ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరి ని, మార్చుకోవాలని వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.ప్రజలు అసహనానికి లోను కాకముందే ప్రభుత్వం సానుకూల చర్యలను చేపట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.
వకుళాభరణం కృష్ణ మోహన్ ను చైర్మన్ గా కొనసాగించాలి:-
అన్ని నియామకాలలో పార్టీ కేడర్ కు అవకాశం ఇవ్వడం వీలు కాదు. అన్ని నియామకాలను రాజకీయ కోణంలో పరిశీలించడం తగదు అని అఖిలపక్ష సమావేశం లో అభిప్రాయం వ్యక్తం అయింది. ప్రస్తుతం అనివార్యత, కీలక పరిస్థితుల నేపధ్యంగా రాజకీయాలకతీతంగా బీసి కమిషన్ లో చైర్మన్, సభ్యుల నియామకం జరగాలని సమావేశం సూచించింది. నిబద్దత, అనుభవంతో కృషి చేస్తున్న వకుళాభరణం కృష్ణ మోహన్ ను చైర్మన్ గా కొనసాగించాలని అఖిల పక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.ముఖ్యమంత్రి ని కోరింది. ఈ కార్యక్రమంలో
సమావేశం సభాధ్యక్షుడు ఎం. లాల్ కృష్ణ , కన్వినర్, రాష్ట్ర బీసి సంక్షేమ సంఘం ,వి. హన్మంత రావు మాజీ రాజ్య సభ సభ్యులు
సిరికొండ మధుసూదన చారి , ఎం.ఎల్.సి, మాజీ స్పీకర్
ఎల్ రమణ , ఎం.ఎల్.సి ,
తీన్మార్ మల్లన్న, ఎం.ఎల్.సి తదితర వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ సంఘాల నాయకులు: గుజ్జ కృష్ణ , జాతీయ బీసి సంక్షేమ సంఘం, కన్వినర్, నాయకులు గుజ్జ సత్యం , అంజి , ప్రొఫెసర్ భాగయ్య , రామలింగం, గొడిగె మల్లేష్ యాదవ్, రాజారం యాదవ్, గాదె సమ్మయ్య, ఎం.ఎన్ మూర్తి, రాజ్ కుమార్, రామ్ కోటి, దాన కర్నాచారి, సామ్యుల్ తదితర 50 బీసి కుల సంఘాలు, ప్రజా సంఘాలు మహిళా సంఘాలు పాల్గొన్నాయి.