రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సమావేశం
మంత్రి జోగురామన్న అధ్యక్షతన రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు వివిధ పరిశోధనల కోసం 10 ప్రాజెక్టుల ఎంపిక జరిగింది. వివిధ పరిశోధనల నిమిత్తం రూ. 50 లక్షలు మంజూరయ్యాయి. భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ శాతం తగ్గించేందుకు అదేవిధంగా కేన్సర్, కిడ్నీ, తలసేమియా వంటి ప్రాణాంతకమైన వ్యాధుల చికిత్సల పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.