సామాజిక న్యాయ సందేశంతో ‘23’ చిత్రం:
: తెలుగు సాహితీ సౌరభంతో వెలుగొందే ‘23’ చిత్రం, సామాజిక న్యాయం కోసం చారిత్రక అడుగుగా నిలిచే అద్భుత కథనమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆవేదనలను, ఆకాంక్షలను సజీవంగా చిత్రించి, ప్రేక్షక హృదయాలను తాకే శక్తి ఈ చిత్రానికి ఉందని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పివిఆర్ అట్రియంలో ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు (మల్లేశం ఫేమ్) రాజు రాచ కొండ, తేజ తన్మయితో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, “మంచి సినిమాలను రూపొందించే బాధ్యత దర్శకులదైతే, వాటిని విజయవంతం చేసే బాధ్యత ప్రేక్షకులది. న్యాయం కోసం పోరాడే ఆత్మస్థైర్యాన్ని ‘23’ చిత్రం ఆవిష్కరిస్తుంది. డా. బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే వంటి సంస్కర్తల పోరాట స్ఫూర్తిని ప్రతిధ్వనించే ఈ కథ, ‘సత్యమే గెలుస్తుంది, న్యాయమే నిలుస్తుంది’ అన్నట్లుగా సాక్షాత్కరిస్తుంది,” అని వివరించారు. గోపాల్ రెడ్డి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు