సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే గడువును పొడిగించాలి.
*తెలంగాణ రాష్ట్రంలో 92% పూర్తయిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే*
*దేశానికే ఆదర్శం సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే*
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల సర్వే విజయవంతంగా సాగిందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు.
ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన చేయడం శుభ పరిణామం. కులగణనతో ప్రజల ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. కేంద్రం జనగణనలో కులగణన చేయాలి. కులగణన సమాజానికి ఎక్స్ రే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కులగణన విషయంలో తమ పోరాటం నిరంతరం సాగుతుందని దుండ్ర కుమారస్వామి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న సమగ్ర ఇంటింటి కుల గణన సర్వేకు మరింత సమయం ఇస్తే బాగుంటుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కులగణనలో వివరాలను నమోదు చేసుకోని కుటుంబాలు ఉన్నాయని, వారిని పరిగణలోకి తీసుకుని కులగణన చేయడానికి గడువును పొడిగిస్తే బాగుంటుందని దుండ్ర కుమారస్వామి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వేలో వీవీఐపీలు కూడా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ ఏరియాలోనే ఎక్కువ మంది తమ వివరాలను ఎన్యుమరేటర్లకు చెప్పడంలేదని గుర్తించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సర్వే 92 శాతం పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. 100 శాతం పూర్తవ్వడానికి ఇంకాస్త సమయం ఇవ్వాలని సూచిస్తున్నామన్నారు.