తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం నిన్న వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ DA) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన 18 డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈనేపథ్యంలోనే డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1.572 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది. డీఏ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ. 350 కోట్ల భారం పడనుంది. ఫించన్ దారులకు కూడా డీఏ వర్తించనుంది. పెరిగిన డీఏ జులై 1, 2017 నుంచి అమలులోకి రానుంది.