యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో కూడా టీ హబ్‌ను ఏర్పాటుచేస్తామ
అమెరికాలో టీ హబ్‌ను ఏర్పాటు చేసినట్టే.. యూకే (యునైటెడ్ కింగ్‌డమ్)లో కూడా ఏర్పాటుచేస్తామని బ్రిటన్ మంత్రికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రతిపాదించారు. టీ-బ్రిడ్జ్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని, యూకేకు కూడా దీన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు. బ్రిటన్ మంత్రి మార్క్ ఫీల్డ్, బ్రిటన్ హై కమిషనర్ డొమినిక్ యాస్‌క్విత్, బ్రిట న్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తదితరులు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారితో కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని తెలిపారు. బ్రిటన్ సంస్థలకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వివరించారు. ఐటీ, జౌళి, బయోటెక్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలతోపాటు రాష్ట్రంలోని పలు పారిశ్రామిక పార్కుల గురించి ప్రత్యేకంగా తెలియజేశారు. ప్రపంచ సంస్థలను విశేషంగా ఆకర్షించేందుకు హైదరాబాద్ ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు వంటివి ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేస్తున్నామని వివరించారు.
బ్రిటన్ బృందం టీహబ్ సందర్శన
అంతకంటే ముందు బ్రిటన్ మంత్రి మార్క్ ఫీల్డ్, తన బృందం సభ్యులతో కలిసి గచ్చిబౌలిలో టీ హబ్‌ను సందర్శించారు. అక్కడ స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి తీసుకుంటున్న చర్యలను చూసి ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఆధునిక ఆవిష్కరణలకు ప్రాముఖ్యతనిచ్చి, వాటిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక వాతావరణాన్ని ఏర్పాటు చేయడంపై మార్క్ ఫీల్డ్.. తెలంగాణ ప్రతభుత్వాన్ని అభినందించారు.