యాదాద్రి భువనగిరి: తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా, బిబినగర్ మండల కేంద్రంలోని శ్రీ ఎం లాబ్స్ సౌజన్యంతో, యదాద్రి భువనగిరి జిల్లా స్త్రీ ,శిశు సంక్షేమ స్ధాయి సంఘం చైర్మన్, బిబినగర్ జడ్పీటిసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి , బిబినగర్ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బిబినగర్ పట్టణ పిహెచ్ సీ మరియు కొండమడుగు పీహెచ్ సీ మరియు బిబినగర్ పట్టణ గ్రామపంచాయితీలకు PPE కిట్లు మరియు గ్లవ్స్ ని అందజేయడం జరిగింది ..
ఈ సందర్బంగా వారు మాట్లడుతూ..
కరోనా పై పోరాడుతూ రోగులకు, ప్రజలకు సేవలందిస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలిచిన వైద్యులు, గ్రామపంచాయతి సిబ్బంది ఆరోగ్యాన్ని కూడా కాపాడాలనే ఉద్దేశ్యంతో శ్రీ ఎం ల్యాబ్ వారు PPE కిట్లు , గ్లవ్స్ లను ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం అని కొనియాడుతూ వారికీ కృతఙ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి ,రైతు సమన్వయ సమితి మండల కన్వినర్ బొక్క జైపాల్ రెడ్డి ,ఆర్యవైశ్య మహసభ జిల్లా అద్యక్షులు మల్లగారి శ్రీనివాస్ ,కంపెనీ ప్రతినిధులు ప్రసాద్ రాజు గారు ,మండల కో ఆప్షన్ సబ్యులు ఎండీ అక్బరు, ఉపసర్పంచి దస్తగిరి, పట్టణ అద్యక్షులు నారగోని మహెష్ , గోలి సంతోశ్ రెడ్డి, తెరాస యువజన విభాగం మండల అద్యక్షులు ఎలుగల నరేందర్, వార్డు సబ్యులు పొట్ట అంజి, మైనారిటీ విభాగం పట్టణ అద్యక్షులు ఎండీ.మస్తాన్, వైద్యులు దాక్షాయణి , ప్రవీణ్ , ఇతర వైద్యసిబ్బంది , శ్రీనివాస రెడ్డి ,ప్రభాకర్ గణేష్ తదితరులు పాల్గోన్నారు ..