• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home S & T Technology Aerospace

స్పైస్‌ జెట్ ప్రయోగాత్మకంగా భారత్‌లో తొలిసారిగా విమానాన్ని జీవ ఇంధనంతో నడిపి విజయవంతమైంది

ప్రయోగాత్మకంగా బంబార్డియర్ క్యూ-400 శ్రేణి విమానాన్ని బయోఫ్యూయల్‌తో నడిపారు

TP NewsbyTP News
28/08/2018
inAerospace, Featured, India, News, S & T
0
biofuel-flight spice jet

 

భారత్‌లో తొలిసారిగా జీవ ఇంధనంతో నడిచే విమానం గాల్లోకి ఎగిరింది. సోమవారం డెహ్రాడూన్- ఢిల్లీ మధ్య ప్రయోగాత్మకంగా బంబార్డియర్ క్యూ-400 శ్రేణి విమానాన్ని బయోఫ్యూయల్‌తో నడిపారు. తొలి ప్రయాణం విజయవంతమైందని విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రకటించింది. పాక్షిక జీవ ఇంధనంతో దీన్ని నడిపినట్లు తెలిపింది. దేశీయ విమానయానరంగంలో తొలిసారి చేపట్టిన ఈ జీవఇంధన ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్‌లో అత్యంత ఖరీదైన ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఇంధన వాడకం తగ్గనున్నది. అదే జరిగితే విమానయానరంగంలో పూర్తిగా జీవ ఇంధనాన్ని వాడే తొలి అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించనున్నది. విమానయాన రంగంలో ఆ ఘనత సాధించిన అమెరికా, ఆస్ట్రేలియాల సరసన భారత్ కూడా చేరనున్నది. సోమవారం ఉదయం డెహ్రాడూన్ జాలీగ్రాంట్ విమానాశ్రయం నుంచి ఈ జీవఇంధన విమానాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ప్రారంభించారు. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ, స్పైస్‌జెట్ అధికారులు.. మొత్తం 20మంది ప్రయాణికులతో ఈ విమానం గాల్లోకి ఎగిరింది. 25నిమిషాల్లోనే విమానం దేశరాజధానికి చేరుకుంది.

biofuel-flight spice jet india

78సీట్లున్న క్యూ-400 విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, సురేశ్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, హర్షవర్ధన్, జయంత్ సిన్హా, స్పైస్‌జెట్ సీఈవో అజయ్ సిన్హా దానికి స్వాగతం పలికారు. పునరుత్పాదక వనరుల నుంచి ఈ జీవ ఇంధనాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం తయారు చేసింది. వ్యవసాయ, తినేందుకు వినియోగించలేని నూనెలు, పారిశ్రామిక, మున్సిపల్ వాడల నుంచి సేకరించిన వ్యర్థాలతో ఈ ఇంధనాన్ని తయారు చేశారు. ప్రధానంగా జట్రోపా మొక్కల నుంచి ఈ బయో ఫ్యూయల్‌ను ఉత్పత్తి చేసేందుకు సుమారు 500 వ్యవసాయ కుటుంబాలు పనిచేశాయి. విమానం కుడి ఇంజిన్‌లో 25శాతం జీవ ఇంధనాన్ని, ఎడమ ఇంజిన్‌లో 75శాతం సాధారణ ఎయిర్ టర్బైన్ ఇంధనాన్ని నింపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు జీవ ఇంధనం దోహదపడుతుందని స్పైస్‌జెట్ సీఈవో అజయ్ సిన్హా చెప్పారు. జీవ ఇంధన వాడకం వల్ల విమాన నిర్వహణ, ప్రయాణ వ్యయం తగ్గుతుంది. తద్వారా పర్యావరణానికి, ప్రయాణికులకూ లాభమే అని అజయ్‌సిన్హా తెలిపారు.

ప్రత్యేక పాలసీ రూపకల్పనలో ప్రభుత్వం

విమానయాన రంగంలోనూ జీవ ఇంధన వినియోగాన్ని మరింత పెంచే దిశగా ప్రత్యేక పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. స్పైస్‌జెట్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే క్యాబినెట్ ముందు ప్రతిపాదన పెట్టనున్నట్లు గడ్కరీ చెప్పారు. జీవ ఇంధనం కాలుష్యకారకాలనే కాకుండా దిగుమతి వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని పౌర విమానయానశాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు.

 

Tags: Bio-FuelSpiceJet
TP News

TP News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News