• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో – చారిత్రక నిర్ణయం

AdminbyAdmin
27/09/2025
inNews
0
బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో – చారిత్రక నిర్ణయం

బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో – చారిత్రక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక జీవో విడుదల చేయడం చారిత్రకమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. ఈ నిర్ణయం తెలంగాణలో సామాజిక న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిందని ఆయన అన్నారు.


బడుగు, బలహీన వర్గాలకు న్యాయ దిక్సూచి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు దుండ్ర కుమారస్వామి గుర్తుచేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ మేరకు కులగణన విజయవంతం చేయడం, విద్యా–ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించడం వంటి చర్యలు బీసీల ఆత్మగౌరవానికి నిదర్శనమని ఆయన అన్నారు.

పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు క్యాబినెట్ మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సమాజం పోరాటం మూలంగానే ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేసి, చివరికి కోర్టు తీర్పు నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్లు పెంచి ముందుకు రావడం హర్షణీయమని అన్నారు.


స్థానిక సంస్థల్లో అమలుకు ఉత్తర్వులు

బీసీల జనాభా 56.33 శాతం ఉన్నప్పటికీ తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 2024లో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించింది. ఆ నివేదికను ఈ ఏడాది మార్చిలో సమర్పించగా, ప్రభుత్వం దానిని పరిశీలించి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిందని ఆయన వివరించారు.

ఈ మేరకు బీసీ బిల్లు–2025ను శాసనసభ, మండలిలలో ప్రవేశపెట్టగా అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అనంతరం బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ శుక్రవారం జీవో నం.3 జారీ చేశారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని 243డి(6), 243టీ(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని వినియోగించి ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అని దుండ్ర కుమారస్వామి కొనియాడారు.


సామాజిక విప్లవం

బీసీలకు 42% రిజర్వేషన్లు కేవలం పాలనా నిర్ణయం కాదని, ఇది ఒక సామాజిక విప్లవమని దుండ్ర కుమారస్వామి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీసీల రాజకీయ స్వరాజ్యానికి గౌరవపీఠమని ఆయన అభివర్ణించారు.

బీసీ రిజర్వేషన్ల పెంపు బీసీ సమాజం దశాబ్దాల పోరాట విజయమని, దీనిని అడ్డుకోవాలని చూసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన హెచ్చరించారు. రిజర్వేషన్ వ్యతిరేక శక్తులను ప్రజాస్వామ్య ఆయుధమైన ఓటుతో భరతం పట్టే వరకు వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు.

Admin

Admin

రిజర్వేషన్లను అడ్డుకోవద్దు – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
News

రిజర్వేషన్లను అడ్డుకోవద్దు – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
28/09/2025
0

రిజర్వేషన్లను అడ్డుకోవద్దు – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సచివాలయం మీడియా పాయింట్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర...

Read more
బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో – చారిత్రక నిర్ణయం

బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో – చారిత్రక నిర్ణయం

27/09/2025
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య — దుండ్ర కుమారస్వామి హెచ్చరిక

24/09/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News