ముంబాయి: కరోనా సంక్షోభంలో బాధితులకు కొండంత అండగా నిలిచిన ప్రముఖ నటుడు సోనూసూద్ మరో కీలక నిర్ణయం ప్రకటించారు. సివిల్ సర్వీసులో చేరాలని కలలుకనే ఐఏఎస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్టు ‘సంభవం’ పేరిట ఓ కొత్త ప్రయత్నం మొదలు పెట్టినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఐఏఎస్ కు ప్రిపేర్ కావాలని అనుకొంటున్నారా? మీ బాధ్యత మేము తీసుకుంటాం’ అంటూ ట్విటర్లో ఆయన ప్రకటించారు. అభ్యర్థుల దరఖాస్తులకు జూన్ 30 గడువుగా వెల్లడించారు. దీనికోసం అభ్యర్థులు ముందుగా www.soodcharityfoundation.org వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ‘రేపు జీవితంలో మీరు ఆర్థికంగా స్థిరపడినపుడు మీ జీవనశైలి పెంచుకోవాలని చూడకండి.. ఇతరులకు ఇవ్వడం ద్వారా వదాన్యత పెంచుకోండి’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more