డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కళావతి సాంగ్ రిలీజ్ అయి యూట్యూబ్లో మిలియన్ల వీక్షణలు అందుకొంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా చేశారు.
ఎవ్రీ ఎవ్రీ పెన్ని.. అనే పాట వీడియో నీ కొంత ఈరోజే యూట్యూబ్ లో విడుదల చేశారు. అయితే ఇందులో మహేశ్ బాబుతో పాటూ కూతురు సితార కూడా కనిపించడం తో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ పాటలో మహేశ్ ఒక గ్రూప్‌లో డ్యాన్స్ చేస్తుంటే సితారా మరో గ్రూప్‌లో మధ్యలో లీడ్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
ఫాదర్‌ని, డాటర్ ని ఒకే పాటలో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే సితార కేవలం ప్రోమో లో కనిపించిందా? లేక సినిమాలో కూడా ఎక్కడైనా సాంగ్ లో కనిపిస్తుందా అనేది వేచిచూడాలి.