సుశాంత్ మరణానికి ఆత్మహత్య కారణం కాదని చెబుతున్న ఓ వీడియోను ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి ఆ వీడియోలో వివరించారు. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై జరిగే మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు.
సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామితోపాటు పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆరోపించారు.