కౌండిన్య సంఘము ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బాలాజీ ఫంక్షనల్ ఎదురుగా ఐటీఐ ఇనిస్టిట్యూట్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 368వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు .మాజీ వై చైర్మన్ సీహెచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు సదాశివపేట మండల సర్దార్ సర్వాయి పాపన్న సంస్థ అధ్యక్షులు తంగడపల్లి.వెంకటేశం గౌడ్ పూలమాలు సమర్పించి నివాళులు అర్పించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ బీసీ దళ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కోవూరి.సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడుతూ దేశంలోనే తొలి వెలుగు బహుజన చక్రవర్తి అయినా మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 18-08-1650లో జన్మించారు .దళిత బహుజన విప్లవ వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల కోసం, బహుజనుల స్వేచ్ఛకోసం, ఆడపడుచుల స్వేచ్ఛ కోసం, భావితరానికి బంగారు బాటలు వేయడానికి పాటుపడ్డ వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన ఆశయాలను ఆచరణలో ఉంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఎటువంటి భంగమూ వాటిల్లకుండా వారి యొక్క అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటూ యువతి యువకులు సర్దార్ సర్వాయి పాపన్న లక్ష్యాలను సాధించాలని అన్నారు .గౌడ కుల వంశోద్ధారకుడు అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగి బహుజనులతో మమేకమై బహుజనులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో ముందుండే విధంగా పాటుపడాలని కోరారు.అదే విధంగా గౌడ కులమునకు చెందిన యువతి యువకులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు మంచి కీర్తి ప్రతిష్టలు మన తెలంగాణ రాష్ట్రంలో తెచ్చి ఆయన యొక్క లక్ష్యమును నెరవేర్చాలని కోరారు.ఈ సందర్భంగా తెలంగాణ అన్ని జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడానికి ముందుంటానని సభా ముఖంగా తెలియజేశారు .ఈ కార్యక్రమం తదునానంతరం గౌడ కులస్తులు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు .ఈ యొక్క కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్ నల్ల. జయరాములు గౌడ్ ,మాజీ కౌన్సిలర్లు కోవూరి.కృష్ణాగౌడ్, జి.కృష్ణాగౌడ్,టి.ఆర్.యస్ పట్టణ నాయకులు బి.పెద్ద గౌడ్ ,యక్స్-టి.ఆర్.యస్.వి పట్టణ అధ్యక్షులు కోవూరి. అనిల్ గౌడ్ ,శంకర్ పల్లి శ్రీనివాస్ గౌడ్,నల్ల.కాశినాథ్ గౌడ్,నల్ల.ప్రశాంత్ గౌడ్,కోవూరి.రవికిరణ్ గౌడ్,బి.అంజనేయులు గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు .
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more