చౌటుప్పల్: చౌటుప్పల్ నుండి హైదరాబాద్ కి వెళ్తున్న ఇసుక లారీ, సడన్ గా టైర్ పగిలి అదుపుతప్పి, మల్కాపురం అనే గ్రామం వద్ద, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ఎక్కి పల్టీ కొట్టింది.
దీనితో లారీలో ఉన్న ఇసుక మొత్తం రోడ్డు మీద పడిపోవడంతో కాసేపు ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది.
దాదాపు ఒక కిలో మీటర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ ట్రాఫిక్ లో చిక్కుకున్న వాళ్ళు పోలీసులకు ఫోన్ చెయ్యడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రొడ్డు మీద అడ్డంగా పడిపోయిన లారీని బుల్డోజర్ల సహాయంతో పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీనితో ట్రాఫిక్ లో చిక్కుకున్న ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు..