హైదరాబాద్ : ప్రముఖ సినీ పాత్రికేయుడు టీఎన్నార్ కరోనా మహమ్మారికి బలైన నేపథ్యంలో ఆయన కుటుంబానికి నటుడు సంపూర్ణేశ్ బాబు ఆర్థికసాయం చేశారు. టీఎన్నార్ అర్ధాంగి జ్యోతి బ్యాంకు ఖాతాలో తాను రూ.50 వేలు జమ చేసినట్టు సంపూర్ణేశ్ బాబు వెల్లడించారు. టీఎన్నార్ ఇంటర్వ్యూ ద్వారా తాను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు పైకెదిగానని వినమ్రంగా తెలిపారు. ఆయన కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, తనవంతు సాయం తప్పకుండా చేస్తానని సంపూ మాటిచ్చారు. ఇతరులు కూడా టీఎన్నార్ కుటుంబానికి ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు. తన ట్వీట్ లో టీఎన్నార్ భార్య జ్యోతి బ్యాంకు ఖాతా నెంబరు, తదితర వివరాలను పంచుకున్నారు.
తెలుగు సినిమా జర్నలిస్టు TNR గారి కుటుంబానికి నా వంతుగా రూ.50,000 వారి భార్య అకౌంట్ లో డిపాసిట్ చెయ్యటం జరిగింది. వారి ఇంటర్వ్యూ ద్వారా నేను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు ఎదిగాను. వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్న, నా వంతు సాయం తప్పక చేయగలను. మీరు కూడా వారి కుటుంబానికి సపోర్ట్ చెయ్యండి. ఈ కష్టకాలంలో మనిషికి మనిషికి తోడుండాలి అని సంపూర్ణేష్ బాబు కోరారు..