ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత – కోట్ల మందికి మనం స్ఫూర్తి కావాలి అని బిసి దళ్ అధ్యక్షుడు శేరిలింగంపల్లి మండలంలోని మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిóగా బిసి దళ్ అధ్యక్షుడు కుమార స్వామీ 100 పైగా మొక్కలు పంపిణీ చేశారు. మరియు మొక్కలు నాటినారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా భావించి తెలంగాణ రాష్ట్రంలో కోట్ల మొక్కలను నాటి
మిగతా వారికి ప్రేరణగా, ఆదర్శంగా మారాలి అలాగే ముందుకు సాగాలి అని,జీవకోటి మనుగడకు చెట్లు ఆధారమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసు కోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో తొలి పలుకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కేశవరెడ్డి తొలి పలుకు పత్రిక స్టాఫ్ రిపోర్టర్ అనిల్ నాయక్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more