సంగారెడ్డి జిల్లా ,సదాశివపేట పట్టణంలో కాళోజీ నారాయణరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి .
ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్ కన్వీనర్ తంగడపల్లి వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిపారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్ కన్వీనర్ తంగడపల్లి వెంకటేశం గౌడ్ పూలమాలలు వేసి కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంలో సంగారెడ్డి జిల్లా బీసీ.దళ్ అధ్యక్షులు కోవూరి. సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు 104 వ జయంతి వేడుకలో పాల్గొని
ప్రజా కవి ,రచయిత మరియు స్వాతంత్య్ర సమరయోధుడైన అయినా
రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న” గా సుపరిచితులు. ఆయన తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం . కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. తెలంగాణ
జీవిత చలనశీలి కాళోజి
పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు.
ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు మరియు తెలంగాణా ఉద్యమకారుడు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ గ్రహీత
ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టబడింది.
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.
ఆయన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 1958 నుండి 60 వరకు పనిచేసారు. రెండేళ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. ఆయన “ఆంధ్ర సారస్వత పరిషత్” వ్యవస్థాపక సభ్యుడు మరియు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు. ఆయన తెలంగాణ రచయితల సంఘం అధ్యకునిగనూ, 1957-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యునిగానూ ఉన్నారని తెలియజేశారు. ఆ తదుపరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కన్వీనర్ తంగడపల్లి వెంకటేశం గౌడ్ తన చివరి రక్తం బొట్టు వరకూ బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరిగే వరకు కాళోజీ నారాయణరావు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన యొక్క ఆశయాన్ని నెరవేరుస్తానని అందరి సమక్షంలో తెలియజేశారు . ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వాతంత్ర సమరయోధుల ఉత్తరాధికారుల సంస్థ జిల్లా కన్వీనర్ మునిపల్లి రమేష్ , ముదిరాజ్ సంఘం పట్టణ గౌరవ సభ్యులు సున్నం రాములు , బిసి మోర్చా పట్టణ అధ్యక్షులు కె వీరేశం , సదాశివపేట 5వ వార్డు అధ్యక్షులు సున్నము కిరణ్ కుమార్ ,సదాశివపేట పట్టణ టీఆర్ఎస్.వీ ఎక్స్ అధ్యక్షులు కోవూరి అనిల్ గౌడ్ , విజ్డమ్ డిగ్రీ కాలేజీ డైరెక్టర్ వై పరమాత్మ గారు , టీబీసీ దళ్ మండల అధ్యక్షులు వై వీరేందర్ గౌడ్ , ఎం.డి నసీర్, సారా సాయిగౌడ్ ,వెంకటేశం గౌడ్ ,మహిపాల్, విష్ణుగౌడ్, రామచదర్ గౌడ్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .