రష్యా అధ్యక్ష కార్యాలయం నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది. ప్రపంచం మొత్తం ఆందోళనతో ఈ యుద్ధం గురించి ఆలోచిస్తున్న వేళ ఈ ప్రకటన వెలువడడం గురించి అందరూ హర్షిస్తున్నారు. చర్చలు జరపడానికి సిద్ధం అని రష్యా ఈ ప్రకటన చేసింది. కానీ దీనికి ఒక షరతు విధించారు. ఉక్రెయిన్ ఉన్నఫలంగా తమ బలగాలను ఆయుధాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
ఇంతకుముందే ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా రష్యాను యుద్ధం ఆపాలని చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. చైనా అధ్యక్షుడితో కూడా పుతిన్ ఫోన్లో సంభాషించారు. తాను యుద్ధం ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇది జరిగిన కొద్ది సమయం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
ఉక్రెయిన్ లో అణిచివేత జరుగుతుంది. ఉక్రెయిన్ పౌరులకు దాని నుండి విముక్తి కల్పించడానికి మేము ఈ ఆపరేషన్ కి పూనుకున్నాము. ఉక్రెయిన్ లో ఈ చర్య తర్వాత తమ భవిష్యత్తు నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉంది. అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావోస్ చెప్పారు.