“ఆర్‌ఆర్‌ఆర్” కొన్ని సంవత్సరాలుగా దేశం మొత్తం ఎదురు చూస్తున్నా సినిమా. ఎన్నోసార్లు పోస్ట్‌పన్ చేసి చివరకు ఈనెల 25వ తారీఖున భారీ అంచనాలతో విడుదల కాబోతోంది. ఒకవైపు నందమూరి ఫ్యాన్సు, మరో వైపు మెగా అభిమానులకు పండగ రోజు. సినిమా హాళ్ళలో అభిమానులను కంట్రోల్ చేయడం ఇలాంటప్పుడు కొంచం కష్టమే.
అభిమానులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున కొన్ని థియేటర్స్ లో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కొన్నిసార్లు అభిమానులు స్క్రీన్స్ దగ్గరకు వెళ్ళి నానా హంగామా చేస్తుంటారు. ఇంతకు ముందు ఎన్నోసార్లు స్క్రీన్‌లు చించేసిన సందర్భాలు ఉన్నాయి.
వీటిని నియంత్రించడానికి కొన్ని థియేటర్‌లలో స్క్రీన్‌ల ముందు యాజమాన్యం మేకులు కొట్టించింది. కొందరు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. చాలా థియేటర్స్ ఓనర్లు పోలీసు బందోబస్తు కోరుతున్నారు.