• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణ స్వీకారం

AdminbyAdmin
03/10/2018
inFeatured, India, Judiciary, News
0
ranjan gogoi cji

భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ రంజన్ గొగోయ్ చేత భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ న్యాయవాది అయిన గొగోయ్ 13నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. ఈశాన్యం నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి సీజేఐగా గగోయ్ చరిత్ర సృష్టించారు. రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన‌ కార్య‌క్ర‌మంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రంజన్ గొగోయ్… అసోం నుంచి ఈ అరుదైన ఘనతను దక్కించుకున్న తొలి న్యాయమూర్తిగా రికార్డు నెలకొల్పారు. 1954 నవంబర్ 18న అసోంలోని దిబ్రూగఢ్‌ జిల్లాలో గొగోయ్ జన్మించారు. 1978లో బార్ అసోసియేషన్‌లో చేరి గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2001 ఫిబ్రవరి 28న హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010 సెప్టెంబర్ 9న పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ అయిన ఆయన… 2011 ఫిబ్రవరి 12న ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 ఏప్రిల్ 23న ఆయనకు సుప్రీం న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. ఈ నెల 2న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం ముగియడంతో.. ఆయన స్థానంలో సుప్రీంకోర్టు సీజేగా గొగోయ్ నియమితులయ్యారు. గొగోయ్ తండ్రి కేశవ్ చంద్ర గొగోయ్ 1982లో అసోం ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Tags: CJI
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News