చిల్కనగర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గ, రాఘవేంద్ర నగర్ కాలనీ లో భారీగా వర్షం నీరు చేరడంతో, కాలనీ అధ్యక్షులు కౌశిక్ ఇచ్చిన సమాచారానికి వెంటనే స్పందిస్తూ టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ అర్ధరాత్రి ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులని ఈ ఈ నాగేందర్, ఏ ఈ రాజ్ కుమార్ తో కలిసి మాన్సూన్ సిబ్బందితో వర్షం నీటిని బ్లాక్ అయిన మ్యాన్హోల్స్ ద్వారా క్లియర్ చేయించడం జరిగింది.
అర్ధరాత్రి అయిన వెంటనే స్పందించిన డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ కి మరియు జిహెచ్ఎంసి అధికారులకి రాఘవేంద్ర నగర్ కాలనీ వాసులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మాస శేఖర్ , బింగి శ్రీనివాస్, బాలు , శ్యామ్, కాలనీ అధ్యక్షులు కౌశిక్ మరియు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.