ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వారు మరొక అద్భుతమైన ఆవిష్కరణకి శ్రీకారం చుట్టారు అది శ్రోతలందరిని బాగా ఆకర్షిస్తుంది.. వివరాల్లోకి వెళ్తే..
సెల్ ఫోన్లో రేడియో వినాలంటే హెడ్సెట్ లేకుండా వినే పరిస్థితి ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో హెడ్ సెట్ అందుబాటులో లేకపోవడం వల్ల రేడియోలో వచ్చే పాటలకు శ్రోతలు మెల్లి మెల్లిగా దూరం అయిపోయారు దీనితో రేడియోకి ప్రజల ఆదరణ కూడా తక్కువ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్రో “రేడియో గార్డెన్” పేరుతో లైవ్ గా మ్యూజిక్ వినేలా ఇస్రో వారు కొత్త ఆవిష్కరణ రూపొందించారు. దీనికి హెడ్ సెట్ అవసరం లేదు. డైరెక్ట్ లింక్ పై http://radio.garden/live క్లిక్ చేస్తే భూగోళం అందంగా తిరగడాన్ని మీరు చూడవచ్చు. అందులో ఆకుపచ్చ రంగులలో చాలా చుక్కలు దర్శనమిస్తాయి..
మీరు ఉన్నటువంటి ఏరియా లొకేషన్ సిగ్నల్ ఆధారంగా మీకు లైవ్ గా రేడియోలో పాటలు వస్తూ ఉంటాయి.. మీరు ఏ చుక్కనైతే నొక్కుతారో ఆ ప్రదేశపు సిగ్నల్ ఆధారంగా పాటలను వినిపిస్తోంది రేడియో గార్డెన్. శ్రోతలు ఇందులో పాటలు వింటూ ఫోన్లో చాటింగ్ లో మునిగిపోతున్నారు అని నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు. ఈ లైవ్ రేడియోకు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి ఆదరణ వస్తుంది అని ఇస్రో ప్రకటించింది.