మల్లాపూర్ : తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా మల్లాపూర్ వార్డ్ ఆఫీస్ లో ప్రొఫెసర్ జయంశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారిని స్మరించుకున్నారు. తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్ర లో చిరకాలం నిలిచిపోతారని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు.
ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో రాష్ట్రాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలతో అభివృద్దిలో తెలంగాణ పోటీ పడుతూ, నూతన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, తద్వారా ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు ఘన నివాళి అర్పిస్తున్నదని వివరించారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శి తాండ వాసుదేవ్ గౌడ్ , డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు సానాల రవి , సీనియర్ నాయకులు తీగుళ్ల శ్రీనివాస్ గౌడ్ , అల్లాడి కృష్ణ యాదవ్ , పద్మా రెడ్డి , ప్రభాకర్ రెడ్డి , భూమండల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.