ప్రభుత్వం నాయీబ్రాహ్మణులు, రజకులు హెయిర్ కటింగ్ షాప్‌లకుకు, ల్యాండ్రీ షాపుల్లో నెలకు 250 యూనిట్ల వరకు డబ్బులుచెల్లించనవసరం లేదని ఇంతకుముందు చెప్పింది. ఎవరైయితే దీనికి దరఖాస్తు చేసుకున్నారో వారికి మీటర్లను ఉచితంగా ఫిట్‌చేసింది. దీన్ని అందరూ సమర్థించారు. ప్రభుత్వం ఇచ్చిన సౌలభ్యం చిన్న చిన్న షాపుల వారికి బాగా ఉపయోగపడుతుందని చెప్పారు.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా నాగులవంచ అప్పారావు అనే నాయీ బ్రాహ్మణుడు మధిర పట్టణం లో చిన్న హెయిర్ కటింగ్ షాప్‌ను నడుపుతున్నాడు. తను ప్రభుత్వం అందించిన పథకం లో భాగంగా మీటర్ ను అప్లై చేసుకున్నాడు. కొత్త మీటర్ నుండి తనకు పోయిన నెలల్లో 250 యూనిట్లకంటే తక్కువ ఉపయోగించడం వల్ల బిల్లు జీరో వచ్చింది. కానీ డిసెంబర్ నెలలో మాత్రం 19,671.92 రూపాయల బిల్లు వచ్చింది.
ఇంతచిన్నషాప్ లో తను అంత కరెంటు ఉపయోగించలేదని అప్పారావు చెప్తున్నాడు. సిబ్బంది మాత్రం దీనిపై కంప్లైంట్ ఇచ్చినా పట్టించు కోవడం లేదనీ, పైగా బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని చెప్తున్నారని అప్పారావు అన్నాడు.