శేరిలింగంపల్లి : ప్రజలను మోసం చేస్తూ తప్పుడు ప్రకటనలతో మెడిసిన్ ను విక్రహించిన వ్యక్తి కి 8 వ మెట్రోపాలిటన్ కోర్ట్ 20 వేల జరిమానా విధించినట్లు రంగారెడ్డి జిల్లా డ్రగ్ ఇన్స్ పెక్టర్ దేవేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హయత్ నగర్ లోని బాలు హెర్బల్ ప్రైవేటు లిమిటెడ్ క్షమపెనీలో కిడ్నీ వ్యాధికి సంబంధించిన సిరఫ్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తు బ్లాస్టోన్ సిరప్ స్టిక్కర్ వేసి మందును విక్రహిస్తుండగా 2019 లో డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడి యాక్ట్ 1954 ప్రకారం డ్రగ్స్ ఇన్స్ పెక్టర్ దేవేందర్ రెడ్డి దాడులు నిర్వహించి సంబంధిత సిరఫ్ ను సీజ్ చేసి, బాలు హెర్బల్ కంపెనీ పై కేసునమోదు చేశారు. కాగా శుక్రవారం రోజు కేసు విచారించిన 8 వ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి నేరం రుజువు కావడం తో నిందితుడికి 20 వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా కట్టని పక్షం లో నెల రోజుల పాటు జైలుశిక్ష విధించినట్లు దేవేందర్ రెడ్డి తెలిపారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more