వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌ను కూడా మంచిగానే ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తన ప్రియుడి పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది. అంతేకాదు, ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే అతడితో ఏదో ఒక టూర్ వెళుతూ తెగ హల్చల్ చేస్తోంది.
వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న పాయల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె అమాంతం ప్యాంట్ బటన్‌తో పాటు జిప్ కూడా తీసేసింది. దీంతో ఆమె నాభి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇక, ఇందులో ఆమె కిందకు చూస్తూ నిశ్శబ్దంకు ఉన్న వ్యాల్యూను చెబుతోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. తద్వారా ఇది వైరల్ అవుతోంది.