హైదరాబాద్ మేడ్చల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మహిళా విభాగం కార్యదర్శిగా బొమ్మ ప్రవళిక నియమితులయ్యారు. ఆదివారం ఉప్పల్ రామంతపూర్ పద్మశాలి సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు మేడం బాబురావు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూపరజిని లు ప్రవళిక కు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బొమ్మ ప్రవళిక మాట్లాడుతూ రాష్ట్రంలోని పద్మశాలి మహిళల హక్కులకోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళల సంక్షేమ అభివృద్ధి కోసం అందరినీ సమైక్య పరిచి సమస్యల పరిష్కారం కోసo, మహిళల అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి సమైక్య పరుస్తాం అని అన్నారు… నన్ను నమ్మి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు మ్యాడo బాబురావు కు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంటక రూప లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, కీ:శే;ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మనవరాలు సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కంది, శ్రీరాములు,రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు భాస్కర్, రాష్ట్ర మీడియా సెల్ కార్యదర్శి బొమ్మ అమరేందర్,గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కత్తుల సుదర్శన్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వనమాల శంకర్, మేడ్చల్ జిల్లా మీడియా సెల్ కార్యదర్శి ఈగ నాగేంద్ర బాబు యువజన నాయకుడు శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more