రాష్ట్రపతి ఆమోదంతో మొత్తం 128 మందికి పద్మ అవార్డులు లభించనున్నాయి.
వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని ప్రశంసిస్తూ అందించే పురస్కారాల్లో పద్మ అవార్డులు ఒకటి. ఈ పద్మ అవార్డులు పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అని మూడు కేటగిరీల్లో ఇస్తారు.
పద్మ అవార్డులు కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ విభాగాల్లో ఇస్తారు.
సీడీఎస్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్ లభించింది. టాటా గ్రూప్ చైర్ పర్సన్ నటరాజన్ చంద్రశేఖర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి సైరస్ పూనావాలాలకు పద్మభూషణ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ట్రేడ్ మరియు ఇండస్ట్రీ రంగానికి విభాగాల్లో ఐదుగురికి పద్మభూషణ్ అవార్డు లభించగా మరో ఇద్దరికి పద్మశ్రీ దక్కింది.