ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విస్తృతి చూస్తూనే ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో జనాలు కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్ పైనే మొగ్గు చూపుతున్నారు. దీంతో అనేక కంపెనీలు ఈ బిజినెస్ ను ఇండియాలో ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా బ్రిటన్‌కి సంస్థ మోటో వన్ ఎలక్ట్రిక్ వాహనాల ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించింది.
హైదరాబాద్‌లో షేక్‌పేటలో మోటో వన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణా రాష్ట్ర వాణిజ్య పరిశమ్రల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ దీనిని నిన్న ప్రారంభించారు.
ఎలక్ట్రిక్ వాహనాల ఎలా పనిచేస్తాయి? చార్జింగ్ ఎలా చేయాలి? బ్యాటరీ సామర్థ్యం లాంటి లైవ్ ఎక్స్పీరియెన్స్ ను వినియోగదారులకు ఇవ్వడానికి దీనిని అందుబాటులోకి తెచ్చిన్నట్టు వన్‌మోటో ఇండియా వ్యవస్థాపకుడు మహ్మద్ ముజామిల్ రియాజ్ తెలిపారు.