నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్
హెచ్‌ఎండీ గ్లోబల్‌కు చెందిన నోకియా మరో కొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియాకు చెందిన 3310 ఫీచర్ ఫోన్‌కు గాను 4జీ వేరియెంట్ ఇప్పటికే లభిస్తుండగా, ‘నోకియా 8110 4జీ’ పేరిట మరో కొత్త 4జీ ఫీచర్ ఫోన్ తాజాగా విడుదలైంది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలో హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో యూజర్లకు పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి.
నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్‌లో 2.4 ఇంచుల కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కీబోర్డుపై స్లైడర్ రూపంలో ఓ కవర్‌ను అమర్చారు. దీన్ని కిందకు స్లైడ్ చేస్తే చాలు ఫోన్ కాల్ ఆటోమేటిక్‌గా లిఫ్ట్ అవుతుంది. స్లైడ్ ఓపెన్ అయి ఉన్నప్పుడు కాల్ మాట్లాడాక దాన్ని క్లోజ్ చేస్తే ఆటోమేటిక్‌గా కాల్ ఎండ్ అవుతుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ కంపెనీకి చెందిన స్నాప్‌డ్రాగన్ 205 మొబైల్ ప్లాట్‌ఫాం చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 1.1 గిగాహెడ్జ్ సామర్థ్యం ఉన్న డ్యుయల్ కోర్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్, గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఔట్‌లుక్, జీమెయిల్ యాప్స్, స్నేక్ గేమ్ యాప్‌లను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు.
నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్ ట్రెడిషనల్ బ్లాక్, బనానా ఎల్లో రంగుల్లో రూ.6,340 ధరకు మే నెలలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఫోన్ ఫీచర్లు…
2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ మెమోరీ, డ్యుయల్ సిమ్, కాయ్ ఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), ఐపీ 52 డ్రిప్ ప్రొటెక్షన్, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, యూఎస్‌బీ 2.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.