నాగచైతన్య, సమంత లు ట్విట్టర్ లో విడాకులు ప్రకటించిన తర్వాత ఇంతవరకు ఎక్కడా పబ్లిక్ లో ఆ టాపిక్ డిస్కస్ చేయలేదు. కానీ “బంగార్రాజు” మూవీ ప్రెస్‌మీట్ లో ఆయన్ని విడాకుల గురించి ప్రశ్నించారు.
నాగార్జున, క్రుతిశెట్టి లూ జంటగా నటిస్తున్న “బంగార్రాజు” చిత్రం లో నాగచైతన్య ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 14 అంటే సంక్రాంతి రోజున విడుదల కానుంది. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రెస్ మీట్ సందర్భంగా నాగచైతన్య ను ఒక విలేకరి ఈమధ్య మీ లైఫ్ లో ఎదురైన పరిస్థితులను మీరు ఎలా ఎదుర్కొన్నారు? అని అడిగారు.
దీనికి సమాధానంగా ఆయన “ఆ సమయంలో మా ఫ్యామిలీ అంతా అండగా నిలిచింది. అది మా ఇద్దరి బాగు కోరి తీసుకున్న నిర్ణయం. దానివల్ల మేము ఇద్దరం సంతోషంగానే ఉన్నాం. కెరీర్ పరంగా కూడా ఇద్దరం సంతోషంగానే ఉన్నాం. అని బదులిచ్చారు.