హైదరాబాద్ మెట్రో రైలు పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మియాపూర్ స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఉన్నాతాధికారులు హాజరయ్యారు. అనంతరం మెట్రోస్టేషన్‌ను రిబ్బన్ కట్టింగ్ చేసి ఆయన ప్రారంభించారు.
#WATCH Live: PM Narendra Modi inaugurates #HyderabadMetro https://t.co/G5vyc2MrmF
— ANI (@ANI) November 28, 2017
ఆ తర్వాత హైదరాబాద్ మెట్రో యాప్, వెబ్‌సైట్‌ను ప్రధాని ప్రారంభించారు. అంతకు ముందు బేగంపేట విమానాశ్రయంలో విమానం దిగిన ప్రధాని అక్కడ బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. అ తర్వాత బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన మియాపూర్‌కి చేరుకున్నారు .
#WATCH PM Modi, along with Telangana CM KC Rao & Guv ESL Narasimhan, takes a ride in the newly inaugurated #HyderabadMetro pic.twitter.com/xLMtrTkGYO
— ANI (@ANI) November 28, 2017