ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండలంలోని మర్పల్లిగూడ గ్రామంలో మాయ పెంటయ్య అనే రైతు వెదజల్లే విధానాన్ని పరిశీలించిన మేడ్చల్ జిల్లా ఎంపీపీల పోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల్ ఎం పి పి ఏనుగు సుదర్శన్ రెడ్డి, తాను కూడా రైతులతో కలిసి పొలంలోకి దిగి “మట్టి మనిషిగా” మారి చాలా ఇష్టంగా, ఎంతో సంతోషంగా ఓడ్ల గింజలను వెదజల్లారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ..
నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్న… వరి వెదజల్లే పద్ధతి ద్వారా రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా, ఎకరానికి 10 క్వింటాళ్ల ధాన్యం అధిక దిగుబడి వస్తుంది. ఇదే గ్రామానికి చెందిన మాయ కిష్టయ్య అనే రైతు ఎకరానికి 48 క్వింటాళ్ల ధాన్యం పండించడం ఒక నిదర్శనం కాబట్టి రైతులు అందరూ ఈ విధానాన్ని అనుసరించి, శ్రమను ఖర్చును తగ్గించి, అధిక దిగుబడి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఆని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సురేష్ రెడ్డి, ఉప సర్పంచ్ మాయ నరేష్ తోపాటు మిగతా రైతులు పాల్గొన్నారు