తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండల పరిధిలోని వెంకటాపురం, ఎదులబాద్, మర్పల్లిగూడెం, మందారం గ్రామాల్లో వైకుంఠ దామాలను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిధులకు కొరత లేకుండా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, టి.ఆర్.ఎస్ ప్రభుత్వం లోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పని దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డుసభ్యులు, మండల తెరాస పార్టీ అధ్యక్షులు కుమార్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.