మల్లాపూర్: మల్లాపూర్ డివిజన్ లోని భవాని నగర్ ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజ్ బాక్స్ డ్రైన్ పనులను, అధికారులతో స్వయంగా పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆణువణువూ పరిశీలించి, త్వరగతిన పనులు పూర్తి అవ్వాలని అధికారులను, కాంట్రాక్టర్ కి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..

రానున్న వర్షాకాలం దృశ్య ప్రజలకు ఇబ్బంది లేకుండా భూగర్భ డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. పనులన్నీ ముమ్మరంగా సాగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందొద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో DE రూప , AE వేణు , వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ , భవాని నగర్ స్థానికులు , స్థానిక తెరాస నాయకులు పీఆర్.ప్రవీణ్ , శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.